విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బుధవారం గుడ్ న్యూస్ అందించింది. వారి జీతాలను 37 శాతం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులను విడుదల చేశారు. తాజా పెంపుతో విద్యుత్ శాఖలోని 27 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రూ.21 వేల కంటే ఎక్కువ జీతం అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.