ఇంటిపై నుండి ప్రమాదవసాత్తు జారిపడి ఓ మతిస్థిమితంలేని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కంచరపాలెం ఐదవపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. రాంజీ ఎస్టేట్స్ ప్రాంతానికి చెందిన రత్తి శ్రీనివాసరావు(32) అనే వ్యక్తి ఈ నెల 11న ఉదయం 5 గంటలకు ఇంటి రెండవ అంతస్తుపైకి వెళ్ళి ప్రమాదవసాత్తు వెనుక వైపు ఉన్న గెడ్డలోకి జారిపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు.