జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం భీమిలి నియోజకవర్గ పరిధిలో గల ఎర్రమట్టి దిబ్బలను సందర్శించనున్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఈ నెల 10వ తేదీన నగరానికి విచ్చేసిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కోసం మంగళగిరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం వస్తారు.