ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ నిర్వహిస్తున్న నిర్మాణాల తొలగింపును అడ్డుకోవాలంటూ బస్తీవాసులు సుప్రీంలో పిటిషను వేశారు. పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ రోజు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల పాటు నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది.