రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బీహార్ గయ ప్రాంతానికి చెందిన వాల్మీకి జాంగిడ్ (18) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 20కి చేరింది. ఈ నెలలో ఇది నాలుగోది. వాల్మీకి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష శిక్షణ కోసం గతేడాది కోటాలో చేరాడు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.