కిడ్నీ మార్పిడి చరిత్రలో వైద్యులు మరో ముందడుగు వేశారు. అమెరికా న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మార్పిడులు రెండు, మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి.