వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి ఏడుగురు చనిపోగా 56 మందికి పైగా గల్లంతయ్యారు. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వర్డె దీవుల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలతో బతికి బయటపడ్డట్లు యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ పేర్కొంది. అయితే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారు దాదాపు మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa