గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు అబీద్ నగర్-2 తాటిచెట్లపాలెం ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు వార్డు కార్పొరేటర్ కెవియన్ శశికళ తో కలిసి బుధవారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.