వాల్తేర్ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ బుధవారం మర్రిపాలెంలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్లో తనిఖీలు చేశారు. సిబ్బందితో మాట్లాడి అక్కడున్న సౌకర్యాలపై ఆరాతీశారు. ఫిట్వేల్ లాత్ ఎలక్ట్రానిక్ ల్యాబ్ స్టోర్స్ గోదాములు, షెడ్లోని అండర్ గేర్ నిర్వహణ డిపో లోకోలను పరిశీలించారు. డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.