ప్రస్తుత వైసిపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రజల జీవనం దుర్భరంగా మారిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంట మండల కేంద్రంలో బుధవారం టిడిపి మండల అధ్యక్షులు ఎన్నింటి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే యువత, మహిళలు, పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.