రానున్న సాధారణ ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ దారపురెడ్డి జగదీష్ అన్నారు. సీతానగరం మండలంలోని రామవరంలో మహిళా శక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలన్నారు. సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బి. విజరు చంద్రను పరిచయం చేశారు.