వాలంటీర్ల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు కరోనాలో వారు ప్రాణాలకు తెగించి అందించిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హితవు చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు తలపులు తడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్,చంద్రబాబులు కరోనా సమయంలో ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు.బయటకు రావడానికే ప్రపంచం అంతా భయపడిపోయిన కరోనా సంక్షోభంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికి కరోనా సోకింది...వారికి ట్రీట్ మెంట్ అందించాల్సిన అవసరం అనే విషయాలను తెలుసుకుని వైద్యసేవలు అందించిన అంశం ప్రజలు మరిచిపోరని అన్నారు.