మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి నాలుగు బెత్తం దెబ్బలు చాలని మాట్లాడిన పవన్ కల్యాణ్‌కు.. మహిళా రక్షణ గురించి, సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాకోర్టు అంటే ఎన్నికలు.. ప్రజల తీర్పు తెలుసుకోవడానికి, వైయస్‌ఆర్ సీపీతో పోటీపడేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపే దమ్మూ, ధైర్యం పవన్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. మహిళా రక్షణ కోసం సీఎం వైయస్ జగన్ అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపించారని, కేంద్రం వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అందులోని అంశాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజాకోర్టు అంటే రీమేక్ సినిమా వకీల్‌సాబ్‌లో సెట్టింగ్‌లు అనుకుంటున్నారా..? అని పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు.