ప్రియుడు తనని వదిలి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ.. అతని కుమారుడిని హత్య చేసింది. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది. పూజా కుమారి(24) అనే యువతి జితేందర్ అనే వ్యక్తితో 2019 నుంచి సహజీవనం చేస్తోంది. అయితే మూడేళ్ల తర్వాత జితేందర్.. పూజను వదిలి, తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన పూజ తన ప్రియుడి 11 ఏళ్ల కుమారుడిని హత్య చేసింది.