పెనుకొండ పట్టణంలోని ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న రవీంద్రనాథ్ కుమారుడు డేనియల్ నాయక్ మెడిసిన్ చదవడానికి గురువారం పెనుకొండ కురుబ సంఘం నాయకులు తమ వంతుగా రూ 15 వేలు నగదును ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ సమక్షంలో విద్యార్థికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామాంజనేయులు, సర్పంచ్ పరమేశ్వరప్ప, మండల అగ్రి అడ్వైజరీ చైర్మన్ కొండలరాయుడు, ఆదినారాయణ, భాను పాల్గొన్నారు.