గుంతకల్లు పట్టణంలోని 37 వార్డులలో క్లాప్ ప్రోగ్రాం నిర్వహణలో భాగంగా యూజర్ ఫీ వసూళ్లను పెంచాలని మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున శానిటేషన్ సెక్రెటరీలకు సూచించారు. గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో క్లాప్ యూజర్ ఫీ వసూళ్లపై శానిటరీ కార్యదర్శులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. యూజర్ ఫీ వసూళ్లు పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లావణ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.