గోరంట్ల పట్టణంలోని మాధవరాయిని గుడి ప్రాంగణంలో గురువారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల11న వెంకటరమణపల్లి లో వడ్డెర్ల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈనెల 28వ తేదీన పెద్దల అభిప్రాయంతో శాంతి ర్యాలీని నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లాల నుండి ప్రతి వడ్డెర బిడ్డ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.