వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు విమర్శలు గుప్పించారు. గురువారం మదనపల్లిలో పుంగనూరు ఘటనలో అరెస్టయి సబ్ జైల్లో ఉన్న సురేంద్ర నాయుడు, డేరంగుల నారాయణ, మనోహర్ నాయుడు, శ్రీనివాసులు, శీనప్ప, రామాంజనేయులు, నాగరాజుయాదవ్, రెడ్డప్ప (తంబాలపల్లి), మాధవ, ప్రభాకర్ వారిని ఉమామహేశ్వర నాయుడు పరామర్శించారు.