కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైసిపి నాయకులు, సచివాలయ కన్వీనర్లతో సమావేశం నిర్వహించి జేసీయస్ సైన్యం యాప్ పై పార్టీ నాయకులకు, సచివాలయ కన్వీనర్లకు గురువారం మంత్రి ఉషాశ్రీచరణ్ అవగాహన కల్పించారు. రాష్ట్రంలో సీఎం జగనన్న అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి డిబిటి ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని పిలుపునిస్తూ వారికి దిశ నిర్దేశం చేశారు.