కొరిశపాడు మండలం కొరిసపాడు గ్రామానికి చెందిన దాట్ల వేణు మృతిపై అతని తండ్రి దాట్ల శీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవి చౌదరి ప్రకటన ద్వారా తెలిపారు. తన కుమారుడు కడుపులో నొప్పి బాధ బరాయించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఫిర్యాదుల పేర్కొన్నట్లు ఎస్సై చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవి చౌదరి తెలియచేశారు.