ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పసుపు గల్ల గ్రామంలో గురువారం నాడు డిఎస్పి అశోక్ వర్ధన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకోటయ్య, ఎస్సై వెంకట కృష్ణయ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు.