ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నాడు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రైతులకు విత్తనాలు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ వ్యవసాయం చేస్తూ షెడ్యూల్ కులాలకు చెందిన వారికి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.