వి. కోట మండలం గురువారం కుంభార్లపల్లి పంచాయతీ ఆర్బికే వద్ద మహిళా పాడి రైతులకు రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల ఎంపీపీ యువరాజు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ. జగనన్న పాలవెల్లువ డైరీకి పాడిరైతులు పాలు పోయడం ద్వారా అధిక లాభాలు ఉంటాయని తెలిపారు. పాల నాణ్యతను బట్టి మూల్యం చెల్లించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీతో పాటు సర్పంచ్ సుభాష్ పాల్గొన్నారు.