ఉగాది తర్వాత టీడీపీ, జనసేన ఉండబోదని ఇటీవల రాష్ట్ర మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బొత్స వ్యాఖ్యలపై రాతపూర్వకంగా అగ్రిమెంటు ఇవ్వాలని చీపురుపల్లి తెదేపా నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. చీపురుపల్లి ఆర్ఈఎఎస్ పరిధిలోని ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని, పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలుపొందారని, నిరూపిస్తే వైకాపానాయకులు రాజకీయ సన్యాసంచేస్తారా అని ప్రశ్నించారు.