ఆధార్ కార్డు ఉన్న వారికి రూ.3 లక్షల లోన్‌ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. 'ప్రధాన మంత్రి లోన్ యోజన' పథకం కింద 35 శాతం సబ్సిడీ సైతం పొందొచ్చని దానిలో సారాంశం. దీనిపై తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఇది తప్పుడు వార్త అని, ఇలాంటి పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించలేదని తెలిపింది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు భద్రంగా ఉంచుకోవాలని సూచించింది.