ప్రజలవద్దకు వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైయస్ఆర్సీపీ శ్రేణులకు మాత్రమే ఉందని, నాలుగేళ్లలో మన ప్రభుత్వం చేసిన మేలును ఇంటింటికీ వెళ్లి ధైర్యంగా చెప్పగలుగుతున్నామని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏ నాయకుడైనా ఓ జిల్లాకు వెళ్లినప్పుడు మేం ఇక్కడ చేసిన పనులివి! చేయబోయే పనులివి!! అని చెప్పుకుంటాడని, మొన్న జిల్లాకు చంద్రబాబు వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆగకుండా వెళ్లిపోయాడని, ఆయన హయాంలో ఏం చేశారో చెప్పుకోలేక అధికార పార్టీ నేతలపై విమర్శలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు.