పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాతే డయాఫ్రం వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం చైర్మన్ కుశ్వీందర్ వోహ్రా స్పష్టం చేశారు. వరద తగ్గాక వాల్ డిజైన్లపైనా చర్చిస్తామని, తమ ముందున్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని తెలిపారు. కొత్త వాల్ నిర్మాణంపై క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే డయాఫ్రం వాల్‌పై తమ నిర్ణయం ఉంటుందని.. కొత్త డ్యాం చేపట్టాలా లేదా అన్నదానిపై ప్రభుత్వం సాంకేతిక అంశాలన్నీ తమకు పంపితే.. సమీక్షించి నిర్ణయానికి వస్తామన్నారు.