పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఇద్దరు ప్రయాణికులు మరణించగా, ఆరుగురు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 90 మంది ప్రయాణికుల బృందంలో వారు ఉన్నారు. అస్వస్థతకు గురైన ఆరుగురిలో ఐదుగురు ఆగ్రాలోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరవ వ్యక్తిని మెడికల్ కాలేజీలో చేర్చారు. ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేక డీహైడ్రేషన్ కు గురైందా అన్న ప్రశ్నకు.. పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందన్నారు. "జెహెర్ ఖురానీ" అని పిలువబడే క్రిమినల్ గ్యాంగ్ వారికి విషం కలిపిన స్వీట్లు ఇచ్చారా అనే దానిపై, అలాంటి ఫిర్యాదు ఏమీ లేదని ఆమె చెప్పారు.