ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 03:56 PM

రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభంజనాన్ని ఏశక్తి అడ్డుకోలేదని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్ధేశ్వర కాలనీలో ఇంటింటికీ టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ......  చంద్రబాబు ప్రకటించిన గ్యారెంటీ పథకాలతో జగన్‌ రెడ్డికి భయం పట్టుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఆలూరు ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నారాయణ, జిల్లా నాయకులు నర్సప్ప, నాగరాజు, సురేంద్ర, మండల కన్వీనర్‌ అశోక్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, టీడీపీ నాయకులు కిషోర్‌, అర్జున్‌, మల్లికార్జున గౌడ్‌, కురువ రంగయ్య, శివ, ఖాసీం, అగ్రహారం నాగరాజు, లక్ష్మీపతి, కృష్ణప్ప, హనుమప్ప పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa