అభివృద్ధి, సంక్షేమంలో మాది ప్రజాప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మీ సంతోషం, మీ భవిష్యత్తు మన ప్రభుత్వ బాధ్యత అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ..... సంక్షేమాన్ని అందించడంలో, అభివృద్ధిని పంచిపెట్టడంలో, సేవా ఫలాలను ప్రజలదాకా తీసుకువెళ్లడంతో ప్రజా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు. ఈ రోజు నిర్ణయాలు తీసుకునేది, పాలసీలు తీసుకువచ్చేది, రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి. కానీ, అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌరసేవలను కూడా ప్రజలకు అందించేది మాత్రం ఉద్యోగుల భుజస్కందాల మీదే జరుగుతోంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. మీ సంతోషం, మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రధాన్యతలే అని, అది నా బాధ్యత అని ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాను అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa