ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మట్ బేడా అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ విషయాన్ని నారాయణపూర్ పోలీసులు ధృవీకరించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఓర్చా అడవుల్లో నక్సలైట్లు ఉన్నారని సోమవారం ఉదయం భద్రతా బలగాలకు సమాచారం అందిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa