అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సభా భవనంలో జిల్లా కలెక్టర్ గిరీష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన పీలేరు నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.