సచివాలయ కన్వీనర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న భీమా పథకం ఒక వరం లాంటిది అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. సోమవారం చోడవరంలో వైస్సార్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను చేయడమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.