ప్రభుత్వం తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చనిపోయిన నా భార్య ఆస్థులు నా పేరుపై మార్పించుకునేందుకు లంచం ఇచ్చాను అని అంటున్నారు. మ్యుటేషన్ కోసం ఓ వెయ్యి రూపాయల ఫీజు చెల్లించా. దానిని కూడా పెద్దది చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదన్నారు. తాను వైసీపీ నాయకుల మాదిరి బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయనన్నారు. తన జోలికి వస్తే వైసీపీ నాయుకులు భస్మం అవుతారని హెచ్చరించారు. ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కుంటానని తెలిపారు.