నేడు తెలుగు సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు..... మేమంతా క్లారిటీ గానే ఉన్నాం అని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని తెలిపారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. తమకు ఇచ్చినట్లే.... డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పినట్లు వివరించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని వెల్లడించారు.