సీఎం జగన్ ఏపీఎన్జీవో మహాసభల్లో మాట్లాడిన మాటలని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు విమర్శించారు. తన ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన అన్యాయాన్ని చెప్పుకుండా, అధికారం చివరి దశకు చేరినా.. ఇంకా అబద్ధాలు, దుష్ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఉద్యోగులు జీతభత్యాల చెల్లింపులు, వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న చెల్లింపులపై వాస్తవాలతో శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని సవాల్ చేశారు. తన ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు జగన్‌రెడ్డి నిరూపించగలడా? అని నిలదీశారు. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేని జగన్ ప్రసంగంతో సోమవారం బ్లాక్ డేగా నిలిచిందన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో అత్యంత దారుణంగా నష్టపోయింది ఉపాధ్యాయులు. నాలుగేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ ప్రకటించలేదు. గతంలో ఎన్జీవో మహాసభలకు వచ్చిన సీఎంలు ఉద్యోగుల సమస్యలు, వారికి చేసిన, చేయాల్సిన వాటిపై మాట్లాడేవారు. కానీ జగన్‌రెడ్డి పరనింద, ఆత్మస్తుతికే పరిమితమయ్యారు’’ అని అశోక్ బాబు విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa