విశాఖ నుంచి బయలు దేరి వెళ్లే రైళ్లకు ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగా కోపర్గావ్, కళ్యాణ్ స్టేషన్లలో రెండు నిమిషాల పాటు అదనపు హాల్ట్లు కల్పించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి బుధవారం తెలిపారు. ఈ నెల 23 నుంచి విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ తెల్లవారుజామున 3. 20 గంటలకు, లోకమాన్యతిలక్-విశాఖ ఎక్స్ ప్రెస్ ఉదయం 7. 32 గంటలకు కళ్యాణ్ స్టేషన్ కు చేరుకుంటాయన్నారు.