చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్(ALS)ని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉందని చెప్పారు. ALS కమాండ్‌ను స్వీకరించిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్ ఇంజిన్లు యాక్టివేట్ అవుతాయని పేర్కొన్నారు. తమ బృందం ప్రతి అంశాన్ని నిర్ధారిస్తూనే ఉంటుందని తెలిపారు.