వరుడు తాళి కట్టే సమయంలో వధువు వివాహం ఆపేసిన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకి చెందిన 29 ఏళ్ల యువకుడికి 21 ఏళ్ల యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరువాడానైలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేయాలకున్నారు. వరుడు మెడలో తాళికట్టబోతున్న సమయంలో వధువు తాళిని లాక్కొని తనకి పెళ్లి ఇష్టంలేదని తెలిపింది. బంధువులు నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో.. వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.