జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టే మహోన్నత ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే, దీనికి మొదటగా ‘సోమయాన్’ అని పేరు పెట్టాలనుకున్నట్లు ఇస్రో మాజీ ఛైర్ పర్సన్ డా.కె.కస్తూరిరంగన్ తెలిపారు. సంస్కృతంలో ఓ శ్లోకం ఆధారంగా ఈ పేరు పెట్టారు. అయితే, నాటి ప్రధాని వాజ్ పేయీ లూనార్ మిషన్ కు ‘చంద్రయాన్’ పేరైతే బాగుంటుందని సూచించారట. ఈ మేరకు నాటి సంగతులు ఆయన గుర్తు చేసుకున్నారు.