అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందుకోలేని వారి కోసం ఏపీ సీఎం జగన్ మరో ముందడుగు వేశారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి నగదు జమ చేయనున్నారు. 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు.