గుజరాత్లో విషవాయువు పీల్చి 28 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భరూచ్ జిల్లాలోని జంబూసర్ సమీపంలో చోటు చేసుకుంది. సరోద్ గ్రామం పీఐ ఇండస్ట్రీస్‌లోని ట్యాంక్‌లో మంటలు చెలరేగడంతో బ్రోమిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 2 వేల మంది కార్మికులు ఉన్నారు. ఆ గ్యాస్‌ను పీల్చడంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వారిలో అస్వస్థతకు గురైన 28 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.