మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఇల్లు ముట్టడిలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్. రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి సందర్భంగా రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు.