ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన వర్శిటీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి ఆయన పాల్గొననున్నారు. రూ.834 కోట్లతో ఈ వర్శిటీలో పీజీ స్థాయిలో 14 కోర్సులు అందించనున్నారు. అనంతరం దత్తిరాజేరు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.