ప్రొద్దుటూరు సాయి శ్రీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వి. త్రివేణి గర్భిణీ మహిళ బి పాజిటివ్ రక్తం అవసరం కాగా వారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఛైర్మెన్ మోరే. లక్ష్మణ్ రావును సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఫౌండేషన్ సభ్యుడు అయినటువంటి జె అశోక్ కుమార్ చేత బి పాజిటివ్ రక్తదానం చేయించారు. ఇతను ఇప్పటికీ దాదాపు 28 సార్లు రక్తదానం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.