భారత వైమానిక దళం అధిక సంఖ్యలో యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో అదనంగా 100 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదలను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపగా, త్వరలోనే ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలు విలువ రూ.66 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.