మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం వెలుగుచూసింది. రేవా జిల్లాకు చెందిన బాలుడు (13) సాత్నాలోని పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్ గదిలో బాలుడు ఉన్న సమయంలో ప్యూన్ రవీంద్ర సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.