ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది..... వైసీపీ ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 08:35 PM

ఓటర్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలావుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలవనున్నారు. ఈ నెల 28న సాయంత్రం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ను కలవబోతున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారయింది. ఓటర్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందనే విషయాన్ని సీఈసీ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లనున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని చెప్పారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోని దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com