జగన్ టీడీపీ నాయకులని, కార్యకర్తలని పెట్టిన కష్టాలు మరువకుండా కసితో పని చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో టీటీడీ పవిత్రతను మంట కలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మనుగా నియమించారన్నారు. పెనాక శరత్ చంద్రారెడ్డి లాంటి దొంగని టీటీడీ సభ్యుడిగా వేశారన్నారు. ఇసుక దోపిడీపై ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa