పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసినట్టు సెబీ శనివారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టింగ్ కంపెనీల్లోని మొత్తం 24 లావాదేవీలపై దర్యాప్తు జరిపామని, అందులో 22 పూర్తిగా దర్యాప్తు చేశామని పేర్కొంది. 12 మంది విదేశీ ఇన్వెస్టర్లతో జరిపిన ఆఫ్‌షోర్ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేసినట్టు పేర్కొంది. కాగా ఈ కేసు విచారణ ఈ నెల 29న సుప్రీంలో జరుగుతుంది.